కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు
కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు వెళ్లాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య దూరం స్పష్టం బహిర్గతం అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరండి. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేము. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్లు పార్టీలు అడుగడునా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పవిత్రమైన యాదాద్రిని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడమే దీనికి పరాకాష్ట. మునుగోడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్టులుగా ఉందామా?. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు.
ఎదురు చూస్తుంటా..మునుగోడుకు తరలిరావాలి : పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు
తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని, మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఈ క్షణమే మునుగోడుకు తరలిరావాలని, అందరి కోసం ఎదురు చూస్తుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన వాళ్లే ఇవాళ అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ , తెరాసలు కుట్ర చేస్తున్నాయని, దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని తెరాస విచ్చలవిడిగా వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన యాదగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠగా రేవంత్ అభివర్ణించారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు పాల్పడ్డారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే వదిలేద్దామా? పార్టీ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు?’’ అని ఆయన నిలదీశారు. తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని, మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ఈ క్షణమే మునుగోడుకు తరలిరావాలని, అందరి కోసం ఎదురు చూస్తుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.