తిరుపతి : సామాజిక బాధ్యత కలిగిన సంస్ధగా ఇండియన్ ఆయిల్ తమ వ్యాపార
ప్రాధాన్యతలకు మించి, సామాజికాభివృద్ధికి తోడ్పాటునందించడంలో ఏ మాత్రం
వెనుకడుగు వేయకుండా తాము అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దిన సామాజిక బాధ్యత
కార్యక్రమాలు (సీఎస్ఆర్) ద్వారా సమాజ అభివృద్ధికి అశేషంగా కృషి చేస్తుంది.
తమ సామాజిక నిర్వహణ కార్యక్రమాలు, సీఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా తిరుమల
తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కి చెందిన టెరిషియరీ రిఫరల్ కేంద్రం
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రోగులు సేవలనందిస్తున్న శ్రీ వెంకటేశ్వర
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)తో ఓ అవగాహన ఒప్పందం
చేసుకుంది. దీనిలో భాగంగా తమ సీఎస్ఆర్ కార్యక్రమాల కింద వైద్య పరికరాలను
అందించనుంది. ఈ ఒప్పందంపై టీటీడీ తిరుపతి ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్ వద్ద బీ అనిల్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్
స్టేట్హెడ్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఆయిల్ డాక్టర్ ఆర్
రామ్, మెడికల్ సూపరిండెంట్, స్విమ్స్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ
వీ ధర్మా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వి సతీష్ కుమార్, డైరెక్టర్
(మార్కెటింగ్), ఇండియన్ ఆయిల్, ఎం గురుమూర్తి, పార్లమెంట్ సభ్యులు,
తిరుపతి, డాక్టర్ ఎస్ దత్తాత్రేయ రావు, ఇండిపెండెంట్ డైరెక్టర్, ఇండియన్
ఆయిల్ పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఇండియన్ ఆయిల్ ఇప్పుడు స్విమ్స్
3 టెస్లా ఎంఆర్ఐ (మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ యంత్ర సామాగ్రి, 4డీ
స్కాన్‌ను 22 కోట్ల రూపాయల వ్యయంతో సమకూర్చునే అవకాశం అందిస్తుంది. వీటిద్వారా
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన చికిత్సనందించడం సాధ్యమవుతుంది.
ఇండియన్ ఆయిల్, టీటీడీలు దీనిని అతి సన్నిహితంగా పర్యవేక్షిస్తాయి. ఈ
ప్రాజెక్ట్ ఏ వీ ధర్మారెడ్డి , వి సతీష్ కుమార్, డైరెక్టర్
(మార్కెటింగ్) , ఇండియన్ ఆయిల్ చేపట్టిన కార్యక్రమం. టీటీడీ నుంచి ఈ
కార్యక్రమంలో ఎస్ భార్గవి, జెఈఓ డాక్టర్ బి వెంగమ్మ, డైరెక్టర్–వీసీ,
స్విమ్స్ ఒ. బాలాజి, ఫైనాన్షియల్ అడ్వైజర్ తో పాటుగా ఇండియన్ ఆయిల్ నుంచి
అజయ్ శ్రీవాస్తవ, జీఎం, కైలాష్ కాంత్, డీజీఎం రోహిత్ మోహన్, డివిజన్
రిటైల్ సేల్స్ హెడ్, తిరుపతి పాల్గొన్నారు.