గుంటూరు : పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామని, పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా
నిలవాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రానున్న ప్రతి
పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్థానికులకే
రావాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తి
కావాలని, అవి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశంలో
పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా
ఫుడ్స్ ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదించారు. మొత్తంగా రూ.498.84 కోట్ల
పెట్టుబడి పెట్టనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి
అవకాశాలు లభిస్తాయి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యంటన్ఈ ఏడాది జూన్ లో
పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా
పెట్టుకున్నారు. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు కోసం
మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా
2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా
పెట్టుకున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ
ఎనర్జీ పార్కు ఏర్పాటు కోసం మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో
రూ.55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల
పెట్టుబడి పెట్టనున్నారు. ఫేజ్ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్ టూ లో 31వేల
మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పార్క్ లో
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత
ఉత్పత్తులు తయారు చేస్తారు. మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩
నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధన రంగంలో వస్తున్న
మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల
ఉత్పత్తి లక్ష్యంగా ఎన్టీపీసీ ముందడుగు వేసింది. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో
ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నారు. డీఐ
పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ చేస్తారు. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల
పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి
మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్రత్యక్షంగా 2,350 మందికి
ఉద్యోగాలు లభిస్తాయి. డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు
పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్
ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రూ. 10వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. కాపర్
కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫూరిక్ యాసిడ్, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ
చేస్తారు. దీని వల్ల ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మే
2023లో ప్రారంభమై, జూన్ 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేదించిన నేపధ్యంలో తమ
కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్ ఫ్యాక్టరీ
కోసం ప్రెవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్ఎంఈ పార్క్
ఏర్పాటుకు ప్రతిపాదించగా ఎస్ఐపీబీ ఆమోదించారు.
కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్
ప్రాజెక్ట్‌లు, 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు
ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నాలుగు విడతల్లో
మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి. 2వేలమందికి ఉద్యోగాలు. దశల వారీగా
పూర్తిస్ధాయిలో మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ
ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ప్రాజెక్ట్‌ల విధానంలో కీలక మార్పులు తీసుకు
వచ్చామని సీఎం వివరించారు. పవర్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర
ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి.
తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31వేలు లీజు కింద చెల్లింపులు
చేస్తారు. దీనివల్ల కరవు ప్రాంతాల్లోని రైతులకు చక్కటి మేలు జరుగుతుంది.
అంతేకాదు.. ప్రతి మెగావాట్ కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు
చెల్లిస్తున్నాయి. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది.
గ్రిడ్ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవని, దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు
వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్. 100 మెగావాట్ల
డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్. మొదటి
విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు.
మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా
5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న
200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం. రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు
వచ్చిన వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. రూ.
1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ.15 వేలమందికి ఉద్యోగాలు. టెలీ
కమ్యూనికేషన్, ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్ మాడ్యూల్స్ ను కంపెనీ
తయారు చేస్తోంది. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తారు.
దీనికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్కు
ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి
ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు.