విజయవాడ : కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట అంబటి ఆయిల్స్
పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడటం పట్ల
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
కార్మికులు పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక
అక్కడికక్కడే మృతి చెందారు. పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి
నరసింగా, మొచ్చంగి సాగర్, కురతాడు బంజు బాబు, కుర్ర రామారావు, పులిమేరు
గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్, ప్రసాద్లను మృతులుగా గుర్తించారు. జిల్లా
యంత్రాంగం నుండి సంఘటన వివరాలు తెప్పించుకున్న గవర్నర్ హరిచందన్, మృతుల
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక
ప్రకటన విడుదల చేసారు.