విజయవాడ : బిజినెస్ మేనేజ్ మెంట్ లో మెళుకువలు తెలుసుకోవడం కోసం విద్యార్థులు
ఒన్ మినిట్ మేనేజర్ అనే పుస్తకం చదవండంటూ కెఎల్ విశ్వవిద్యాలయం లో ఎంబిఎ
చదువుతున్న విద్యార్థులకు సూచన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు
ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధాన మిచ్చారు. గురువారం ఆర్టీసీ హౌస్ లోని తన
ఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో
ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కార ధోరణి సూచించారు. యువత ఒక లక్ష్యాన్ని
నిర్దేశించుకుని ముందుకెళితే అనుకున్నది సాధించ వచ్చని అన్నారు. మనం
చేరాలనుకునే గమ్యం మనం వెళ్ళే దారి మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి
విద్యార్థి తన ఒక ప్రాధమిక అంశాలను మరువకూడదన్నారు. ప్రాధమిక అంశాలను నైపుణ్యం
తో ఏవిదంగా వాడుకోవాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థి తల్లి
దండ్రులు మనల్ని చూసి గర్వ పడేలా జీవించాలన్నారు.
నాయకత్వ లక్షణాలతో విజయం సాధించ వచ్చన్నారు. మనకి ప్రతి విషయం మీద అవగాహన ఉంటే
ఆధిక్యత వస్తుందన్నారు. భావి భారత అభివృద్ధి బాధ్యత విద్యార్థుల పైనే
ఉందన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్
జి.పార్థసారథి వర్మ, ప్రో విసి.డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్
ఎ.జగదీష్, అధ్యాపకులు డాక్టర్ జెవి.రమణ, డాక్టర్ సిహెచ్.బాలాజి తదితరులు
పాల్గొన్నారు.