టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు నిధులను సేకరించేందుకు
తన సేకరణ నుంచి సంతకం చేసిన క్రిస్టియానో రొనాల్డో జెర్సీని వేలం వేయనున్నారు.
ఈ మేరకు ట్విట్టర్లో జువెంటస్లో రొనాల్డో సహచరుడిగా ఉన్న డెమిరల్
ముందుకువచ్చాడు. టర్కీ, సిరియాలోని పరిస్థితుల గురించి మాజీ మాంచెస్టర్
రొనాల్డోతో మాట్లాడానని చెప్పాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని స్థానిక
ఎన్జీవోకు విరాళంగా అందజేస్తారు. “నేను ఇప్పుడే క్రిస్టియానోతో మాట్లాడాను.
టర్కీలో జరిగిన దాని గురించి చాలా బాధగా ఉంది.రొనాల్డో సంతకం చేసిన జెర్సీని
వేలం వేస్తున్నాం. వేలం ద్వారా వచ్చిన మొత్తం భూకంపం జోన్లో
ఉపయోగించబడుతుంది. నిధులు విరాళంగా ఇవ్వబడతాయి…” అని డెమిరల్ ట్విట్టర్లో
సంతకం చేసిన జెర్సీని పోస్ట్ చేశాడు.