అమరావతి :గతంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన డీజీ సునీల్ కుమార్ వ్యవహారంపై
ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. డీజీ సునీల్ కుమార్ పై
చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సీఎస్ కు డీవోపీటీ లేఖ రాసింది. ఎలాంటి చర్యలు
తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్
సెక్రటరీ సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ కు లేఖ పంపారు. సునీల్ కుమార్ విద్వేషపూరిత
ప్రసంగాలు చేశారని రఘురామకృష్ణరాజు గతంలో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికగా డీజీ విద్వేష వ్యాఖ్యలు చేశారని వివరించారు.
అప్పట్లో రఘురామ డీవోపీటీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.