న్యూ ఢిల్లీ : ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టుల అమలుకు కేంద్రం నిధులిస్తానన్నా,
చేసిన పనులకు తన వాటా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరు తీరుతో
రైల్వేల అభివృద్ధి మందగిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై కేంద్ర
మంత్రుల ప్రకటనతో పార్లమెంటు సాక్షిగా ఏపీ పరువు మంట కలుస్తోంది.
విజయవాడ-గుడివాడ-భీమవరం-నరసాపురం, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు మధ్య
చేపడుతున్న 221 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తన వాటా కింద
ఇంకా రూ.1,910 కోట్లు చెల్లించాల్సి ఉందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
తెలిపారు.