ఇన్ స్టాలో ఫోటో షేర్ ..
భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి
పీల్చుకోగలుగుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్
పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రెండు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడంతో
పంత్ కోలుకుంటున్నాడు. అయితే దాదాపు 40 రోజుల తర్వాత తన ఆరోగ్యంపై పంత్ కీలక
అప్ డేట్ ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫోటోను ఇన్ స్టాలో రిషబ్ పంత్ షేర్
చేశాడు. ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని
ఎప్పుడూ అనుకోలేదని పంత్ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. అయితే తాను చికిత్స
పొందుతున్న ఆసుపత్రి భవనంలోనే పంత్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.