విదేశీ విమానాల కంటే బెస్ట్
భారత వాయుసేన సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్
జె.చలపతి
బెంగుళూరు : ఆయుధ సామగ్రి, ఉపకరణాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతోందని భారత
వాయుసేన సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్
జె.చలపతి అన్నారు. ఈ విషయంలో దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలకు తోడు, ప్రైవేటు
సంస్థలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు ‘తేజస్’
యుద్ధవిమానం మనదేశానికి గర్వకారణమని, రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది నిదర్శనమని
ఆయన అన్నారు.
‘తేజస్’ యుద్ధవిమానం మనదేశానికి గర్వకారణమని, రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది
నిదర్శనమని భారత వాయుసేన సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్
మార్షల్ జె.చలపతి అన్నారు. ఆయుధ సామగ్రి, ఉపకరణాల కోసం విదేశాలపై ఆధారపడడం
తగ్గుతోందని, ఈ విషయంలో దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలకు తోడు, ప్రైవేటు
సంస్థలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భారత వాయుసేన ఏ
దేశానికీ తీసిపోదని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా మనకుందని
పేర్కొన్నారు. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సోమవారం నుంచి
శుక్రవారం వరకూ ‘ఏరో ఇండియా 2023′ పేరుతో ఎయిర్‌షో జరగనుంది. ఈ సందర్భంగా భారత
వాయుసేన శక్తియుక్తులు, రక్షణ తయారీలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం.. సంబంధిత
అంశాలపై ఎయిర్ మార్షల్ జె.చలపతి మాట్లాడారు.
భారత వాయుసేన సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్
జె.చలపతి’ఏరో ఇండియా’ నిర్వహణలో ప్రధానోద్దేశం ఏమిటి?
ప్రధానంగా మిలిటరీ, కొంతవరకూ పౌరవిమానయాన రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న
సాంకేతిక మార్పులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వీలుకల్పిస్తుంది.
ఎలక్ట్రానిక్ యుద్ధ నైపుణ్యాలు, కమ్యూనికేషన్లలో మార్పులు, సీసీటీవీ
సెక్యూరిటీ, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు,
హెలికాప్టర్లు, ఆయుధాలు.. ఇలా ఎన్నో అంశాలు తెలుసుకునేందుకు ఇది సరైన వేదిక.
దీనికి పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు, నిపుణులు హాజరవుతారు. వారితో
సంబంధాలకు ఇది మంచి అవకాశం. అదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను
ప్రదర్శించి కొత్త వినియోగదారులను సంపాదించుకోగలుగుతాయి. యుద్ధ విమానాల
ప్రదర్శన ‘ఏరో ఇండియా’కు ప్రధాన ఆకర్షణ. తద్వారా మనకున్న అత్యాధునిక యుద్ధ
విమానాలు, పైలట్ల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పినట్లు అవుతుంది.
ఈ ప్రదర్శనతో భారత వాయుసేనకు, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల రంగానికి ఏ మేరకు మేలు
జరుగుతుంది?
మన దేశానికి ఆయుధాలు, రక్షణ సామగ్రి విక్రయించాలనే ఉద్దేశంలో ‘ఏరో ఇండియా’కు
గతంలో పెద్ద సంఖ్యలో విదేశీ సంస్థలు హాజరయ్యేవి. కానీ ఇటీవల కాలంలో భారతీయ
సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. రక్షణ తయారీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న
దేశీయ కంపెనీలు ఈ ప్రదర్శనను వినియోగించుకుంటున్నాయి. తద్వారా దేశంలోని రక్షణ
రంగ పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశం కలుగుతోంది.