పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు మంగళవారం పశ్చిమ బెంగాల్ అంతటా జనం ఆసక్తి చూపారు. ఇళ్ళ పైకప్పులపై, బహిరంగ మైదానాల్లో వారు గుంపులు గుంపులుగా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించి మంత్రముగ్ధులయ్యారు. ఇది అనేక ఇతరదేశాలతో పాటు భారతదేశంలోని చాలా ప్రాంతాలలోనూ కనిపించింది.
ముఖ్యంగా కోల్కతాలోని బిర్లా ఇండస్ట్రియల్&టెక్నలాజికల్ మ్యూజియం (BITM) వద్ద దాదాపు 25 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇతర సందర్శకులు ఖగోళదృశ్యాన్నివీక్షించడానికి దాని ప్రాంగణంలోగుమిగూడారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ స్పేస్ అండ్ ఎర్త్ డైరెక్టర్ దేబి ప్రోసాద్దు వారీ మాట్లాడుతూ, “సాయంత్రం 4:52 గంటలకు విశ్వ అనుభవం ప్రారంభమైంది. సాయంత్రం 5:01 గంటలకు గరిష్టస్థాయికి చేరుకుంది అన్నారు.