ముందుగా గుర్తిస్తే చాలా ఉత్తమం..
తల్లిదండ్రులకు అవగాహన ఉండాలంటున్న శిశువైద్యులుపిల్లల క్యాన్సర్ గురించిన అవగాహన అనేది తల్లిదండ్రులకు ఎంతో అవసరం. అనేక
చిన్ననాటి అనారోగ్యాలు వైరస్లు, ఇతర సాధారణ సమస్యల వల్ల సంభవిస్తున్నప్పటికీ,
పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి, సంకేతంగా ఉండే లక్షణాల
గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన
వైరల్ ఇన్ఫెక్షన్లు, బరువు తగ్గడం, లేదా ఆకలి మందగించడం, తలనొప్పి, లేదా
వివరించలేని జ్వరం వంటివి మీ పిల్లల్లో క్యాన్సర్ కారకాలు కావచ్చు.
ఈ పరిస్థితులు ఇతర అనారోగ్యాలుగా సులభంగా పొరబడవచ్చు. అయితే, అవి
కొనసాగితే, వీలైనంత త్వరగా పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ నుంచి వైద్య సలహా పొందడం
అవసరమని ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు.
పిల్లల క్యాన్సర్లలో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి తగిన చికిత్స చేస్తే “నయం
కాగలవు” అని నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల్లో క్యాన్సర్ నిర్ధారణ
సాధారణ వైద్యులు, శిశువైద్యులకు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే సంకేతాలు, లక్షణాలు
తరచుగా సాధారణ అనారోగ్యాన్ని పోలి ఉంటాయి. కుటుంబ సభ్యులు, సాధారణ వైద్యులకు
రోగలక్షణాల గురించి అవగాహన లేకపోవడం, తప్పుగా మందులు పంపిణీ చేయడం వల్ల రోగం
ఎక్కువగా ముదురుతుంది. పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్లను కలుసు కోవడానికి ముందు
కుటుంబం సగటున ముగ్గురు, నలుగురు వైద్యులతో సంప్రదింపులను కలిగి ఉండటం తరచుగా
కనిపిస్తుంది. ఇది జాప్యానికి దారి తీసి క్యాన్సర్ ను గుర్తించడం ఆలస్యం
కావచ్చు. కాబట్టి పిల్లల క్యాన్సర్ల పై తల్లిదండ్రులకు అవగాహన అవసరం.