హన్మకొండలోని రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలను రాష్ట్ర ప్రణాళికా
సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్
భాస్కర్ తో కలిసి సందర్శించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో బాలికలను పలు
అంశాలపై వినోద్ కుమార్ ప్రశ్నలు వేయగా బాలికలు టక్కున సమాధానాలు ఇచ్చారు.
మైనారిటీ బాలికల సెన్స్ ఆఫ్ హ్యూమర్ పట్ల వినోద్ కుమార్ ముగ్ధులయ్యారు.
రాష్ట్రంలో కేవలం మైనారిటీ బాల బాలికల విద్యా కోసం 205 గురుకుల పాఠశాలలను
రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని, ఒక్కొక్క విద్యార్థికి లక్ష 25 వేల రూపాయలను
వెచ్చిస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. మైనారిటీ బాల బాలికలతో పాటు ఎస్సీ,
ఎస్టీ, బీసీ బాల బాలికల కోసం కూడా గురుకుల పాఠశాలలను 1000కి పైగా
ప్రారంభించామని తెలిపారు. బలహీన, బడుగు వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఆ వర్గాల అభ్యున్నతి కోసం
రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు.