హైదరాబాద్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని
చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. యూసుఫ్ గూడ లోని
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా
టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా
రూపొందించిన సాంగ్ ను విడుదల చేశారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించి పరీక్షలను
చేయించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఎంతో
అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్ప నేత కేసిఆర్ అన్నారు.
చలనచిత్ర, టీవీ పరిశ్రమలలో లక్షలాది మంది జీవనం పొందుతున్నారని పేర్కొన్నారు.
తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వివిధ బాషలకు చెందిన కళాకారులకు అనేక అవకాశాలు
లభిస్తున్నాయని చెప్పారు. ఒక్కప్పుడు చలనచిత్ర పరిశ్రమ అంటే చెన్నై పేరు
గుర్తుకోచ్చేదని, నేడు తెలంగాణా రాష్ట్రం కేరాప్ గా మారిందని, ఇది మనకెంతో
గర్వకారణం అన్నారు. ఇటీవల కాలంలో ప్రజలు టీవీ సీరియల్స్ పట్ల ఎంతో ఆసక్తి
కనబరుస్తున్నారని అన్నారు. చలనచిత్ర పరిశ్రమ, టీవీ ఫెడరేషన్ లోని ఆర్టిస్ట్
లు, టెక్నిషన్ లలో అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి,
షాదీ ముబారక్ ల క్రింద పెండ్లికి ఆర్ధిక సహాయం, ఆరోగ్య శ్రీ క్రింద వైద్య
సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి
ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆవిర్బావానికి ముందు అనేక
అనుమానాలు ఉండేవని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అనుమానాలు అన్ని
తొలగిపోయాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా సంతోషంగా ఉండాలనేది
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు.