దాడికి దిగిన అభిమానులు
8మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
భారత క్రికెటర్ పృథ్వీ షా ఓ మహిళతో జగడానికి దిగిన వీడియో గురువారం సోషల్
మీడియాలో వైరల్ అయింది. దీంతో పృథ్వీ షా వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై
అభిమానులు దాడికి పాల్పడ్డారు.ఈ వీడియోల్లో, పృథ్వీ షా ఒక మహిళా అభిమానితో
తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు వ్యక్తులతో సెల్ఫీలు తీసుకోవడానికి
నిరాకరించినందుకు షాపై బుధవారం తెల్లవారుజామున ముంబైలోని ఓషివారాలో
‘అభిమానులు’ దాడి చేశారు. దాడి అనంతరం ఓషివారా పోలీసులు ఎనిమిది మందిపై కేసు
నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులతో రెండోసారి సెల్ఫీ తీసుకోవడానికి
నిరాకరించడంతో భారత క్రికెటర్ పృథ్వీ షాతో పాటు అతడి స్నేహితుడి కారుపై దాడి
చేసిన ఆరోపణలపై ఓషివారా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు.