రాజమహేంద్రవరం : ప్రజలకు సత్వర సేవలందించి వారి మన్ననలు పొందాలని ఆర్డీవో
చైత్రవర్షిణి సూచించారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన రాజమహేద్రవరం డివిజన్ గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం కమిటీని ఆమె అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా
వీఆర్వోల సంఘం అధ్యక్షులు కె సూర్యనారాయణ ఆమెను సబ్‌కలెక్టర్ కార్యాలయంలో
కలిశారు. ఈ సందర్బంగా రాజమహేంద్రవరం డివిజన్ వీఆర్వోల నూతన కమిటీని ఆర్డీవోకు
పరిచయం చేశారు. అనంతరం చైత్రవర్షిణి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం
నవ రత్నాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ
పధకాలు అందించి వారి అభిమానం చూరగొనాలని హితవు పలికారు.
కొత్త కమిటీ సారధులు వీరే
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కె.
సూర్యనారాయణ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాజమహేంద్రవరం డివిజన్ నూతన కమిటీనీ
ఎన్నుకున్నారు. డివిజన్ కమిటీ అధ్యక్షులుగా ఏ.శ్రీనివాసరావు (రాజమండ్రి
రూరల్), ఉపాధ్యక్షులుగా ఓ.శ్రీనివాసురావు, కె.రవికుమార్(అనపర్తి), బి.విజయ
దుర్గ (రాజమండ్రిరూరల్) ప్రధాన కార్యదర్శిగా సి.హెచ్ ఆదినారాయణ(కడియం),
కోశాధికారిగా కె.సుబ్బారావు (కడియం), సంయుక్త కార్యదర్శులుగా వై.వినయ్
(రాజమహేంద్రవరం అర్బన్), డి.శశికళ (రాజమహేంద్రవరం రూరల్), ప్రచార
కార్యదర్శిగా ఏ.శివకృష్ణ(కడియం) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యుటివ్ కమిటీ సభ్యులుగా
జైనీ సాహెబ్, వి.వెంకట్, నాగేశ్వరరావు, జి.గంగరాజు, ఏం. రామారావును
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.