హైదరాబాద్ : సాయన్న మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. ఇంటికి చేరుకొని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబీకులను
పరామర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న
ఆరోగ్య సమస్యలతో ఆదివారం కన్నుమూశారు. ఈ నెల 16న అస్వస్థతకు గురైన ఆయనను
కుటుంబీ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో
బాధపడుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా ఇవాళ 1.50 గంట సమయంలో
తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో రావడంతో గుండె ఆగిపోవడంతో మృతి
చెందినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సాయన్న మృతిపై సీఎం కేసీఆర్
సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడంపై సీఎం
విచారం వ్యక్తం చేశారు. సాయన్న ఇంటికి చేరుకొని పార్థీవదేహం వద్ద
నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ
పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమమన్నారు. ఈ సందర్భంగా సాయన్నతో
ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉండగా సాయన్న అంత్యక్రియలు
సోమవారం బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు
తెలిపారు.