విజయవాడ : వన్‌టౌన్ కెనాల్ రోడ్డులో రథోత్సవం నేత్రపర్వంగా సాగింది.
నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ
కొట్టి జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు.
విశిష్ట అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి
ఈవో ధర్భముళ్ళ భ్రమరాంబ, పాలక మండలి కమిటీ ఛైర్మన్ కర్నాటి రాంబాబు,
కమిటీ సభ్యులు హాజరయ్యారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు,
మంగళహారతులు, భక్తుల శివనామ స్మరణ నడుమ కోలాహలంగా రథోత్సవం
సాగింది.