వైఎస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల
శ్రీనివాస కుమార్విజయవాడ : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సీనియర్ రాజకీయ
నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ వైఎస్సార్ పార్టీ లో చేరారు. తాడేపల్లి లోని
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం
రాత్రి ఆకుల శ్రీనివాస కుమార్ , అయన అనుచరులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా
రాష్ట్ర విద్యుత్ , అటవీ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
మాట్లాడుతూ కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస
కుమార్ వైఎస్సార్ పార్టీలోకి రావడం శుభపరిణామం అని అన్నారు. శ్రీనివాస్ కుమార్
ను హృదయ పూర్వకంగా పార్టీ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. మాజీ మంత్రి , విజయవాడ
పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ
వంగవీటి మోహన రంగా ముఖ్య అనుచరులలో ఒకరైన ఆకుల శ్రీనివాస కుమార్ ను సాదరంగా
వైఎస్సార్ పార్టీ లోకి అహ్వానించడం జరిగిందన్నారు. త్వరలో ఇంకా కొంతమంది
నాయకులు, శ్రీనివాస్ సన్నిహితులు, ముఖ్యులు, పార్టీలో చేరతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్
చైర్మన్ అడపా శేషగిరి , శాసనమండలి సభ్యులు రుహుల్లా పాల్గొన్నారు.