రాష్ట్రాన్ని ప్రపంచ జీవ ఔషధ వ్యవస్థకు విజ్ఞాన రాజధానిగా మారుస్తాం
సాంకేతికత సమ్మిళితంతో అసాధ్యాలు సుసాధ్యం
రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ విలువ రెండేళ్లలోనే 23% వృద్ధి
2030 నాటికి 25 వేల కోట్ల డాలర్ల లక్ష్యం
బయో ఆసియా సదస్సు ప్రారంభ వేడుకలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ‘జీవితంలో నువ్వు ఎక్కడున్నావనేది కాదు.. ఇంకా ప్రయాణించాల్సింది
చాలా ఉంది’ అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశం మాకు ప్రేరణ. తెలంగాణలో
బయోలాజికల్ హబ్‌ను నెలకొల్పడం ద్వారా బయో ఫార్మా పరిశోధనలు, ఉత్పత్తులకు
పెద్దపీట వేస్తున్నాం. సెల్, జీన్ థెరపీ రంగాల్లోనూ పెట్టుబడులను
ఆహ్వానిస్తున్నాం. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 30 లక్షల చదరపు అడుగుల్లో వసతులు
కల్పించాం. వచ్చే అయిదేళ్లలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలను నెలకొల్పడంలో
హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్ కీలకం కానుంది.
2025 నాటికే లక్ష్యాన్ని అధిగమిస్తాం : కేటీఆర్ మాట్లాడుతూ ‘జీనోమ్ వ్యాలీ
వంటి అతి పెద్ద జీవ ఔషధ వ్యవస్థతో పాటు విస్తరిస్తున్న మెడ్‌టెక్ పార్కు,
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. 2030 నాటికి మా
లైఫ్ సైన్సెస్ విలువ 10 వేల కోట్ల డాలర్లకు ఎదగాలని తొలుత లక్ష్యంగా
నిర్దేశించుకున్నాం. కానీ నేను ఇప్పుడు సంతోషంగా, గర్వంగా ప్రకటిస్తున్నా.
ఎఫ్‌డీఏ అనుమతి పొందిన 200 కంపెనీలు ఇక్కడే : ఆరజెన్, సాయి, సింజేన్,
డెలాయిట్, యాక్సెంచర్, టెక్ మహీంద్ర తదితర కంపెనీలతో కలిసి సృజనాత్మక,
పరిశోధనల్లో ముందుకెళ్తున్నాం.
లైఫ్‌సైన్సెస్ విశేష కృషి : డాక్టర్ వీకే పాల్
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ ‘కొవిడ్ సమయంలో లైఫ్
సైన్సెస్ రంగం విశేషంగా కృషిచేసింది. వేర్వేరు రకాల వ్యాక్సిన్లను వేగంగా
అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వదేశానికే కాకుండా 101 ప్రపంచ దేశాలకు 258
బిలియన్ డోసులను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నొవార్టిస్
సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. ఫ్లాండర్స్ ప్రతినిధి
జయంత్ నడిగర్ మాట్లాడుతూ.. బెల్జియం జీవ ఔషధ రంగంలో ఫ్లాండర్స్ కీలకంగా
వ్యవహరిస్తోందని, తెలంగాణలో బయో ఆసియా కూడా ఇదే తీరులో ప్రధానపాత్ర
పోషిస్తోందన్నారు. ఏపీ, తెలంగాణల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్
వైన్ ఓవెన్ మాట్లాడుతూ.. బయో ఆసియా 2023లో భాగస్వామ్యం వహించడం సంతోషంగా
ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సవాళ్లపై కలిసి పోరాడదామని అన్నారు. బ్రిస్టల్
మయార్స్ స్క్విబ్ (అమెరికా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సమిత్
హిరావత్ మాట్లాడుతూ తెలంగాణతో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, బయో ఆసియా సలహామండలి
సభ్యుడు డాక్టర్ అజిత్ శెట్టి, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఛైర్మన్
సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్
తదితరులు మాట్లాడారు.