బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థి నగనూరు
రాఘవేంద్ర కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అనంతపురం పార్లమెంటు
ఉరవకొండ లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె
దేవానంద్, అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, ఎస్సీ
మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంత కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు
రాజేష్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం ఉరవకొండ లోని శ్రీ సాయి
ట్యుటోరియల్స్ కోచింగ్ సెంటర్ లో జరిగిన సరస్వతి పూజా కార్యక్రమంలో
ముఖ్యఅతిధులుగా గుడిసె దేవానంద్, సందిరెడ్డి శ్రీనివాసులు పాల్గొని కోచింగ్
సెంటర్ లోని విద్యార్థులకు విద్య గొప్పతనం గురించి వివరించి భవిష్యత్తు లో
మీరు ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి దేశానికి, సమాజానికి మీ వంతు మంచి
చేయాలని దిశానిర్దేశం చేశారు.