హైదరాబాద్ : అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. ఈ
వ్యవహారంపై కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల పైసలతో ఆటలా? అని
ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే మౌనం ఎందుకు?
అని ఫైర్ అయ్యారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా మౌనం? అని
ధ్వజమెత్తారు.