కంబోడియాలో కేసు.. 11 ఏళ్ల బాలిక మృతి
ధృవీకరించిన ఆరోగ్య అధికారులు
కంబోడియాలో గత తొమ్మిదేళ్లలో మొట్టమొదటి సా రిగా గా బర్డ్ ఫ్లూతో11 ఏళ్ల బాలిక మరణించినట్లు ఆరోగ్య అధికారులు ధృవీకరించారు.
గ్రామీణ ప్రి వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన బాలికకు బుధవారం హెచ్5ఎన్1 వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె ఒక వారం క్రితం తీవ్ర జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు.
ఆమె తండ్రికి కూడా పాజిటివ్‌గా వచ్చిందని, మరో 11 మంది పరీక్షలు చేయించుకున్నారని కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం, ఆరోగ్య మంత్రి మామ్ బున్హెంగ్ మాట్లాడుతూ, 2014 నుంచి కంబోడియాలో H5N1 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ సంక్రమణ ఇది.
బాలికను తన గ్రామం నుంచి రాజధాని నమ్ పెన్లోని పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు – కానీ ఆమె వ్యాధి నిర్ధారణ అయిన కొద్దిసేపటికే మరణించింది.
కంబోడియాలో చివరిసారిగా 2014లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. అంతకు ముందు దశాబ్దంలో, 56మందికి H5N1 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అందులో 37 మందికి పరిస్థితి ప్రాణాంతకంగా వుంది.