విశాఖపట్నం : మర్చి 3,4 తేదీలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్
ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లబోతుందని
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈసదస్సుకు
సంబంధించి మంగళవారం స్థానిక నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ
వనరులు, మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలోని పరిశ్రమల ప్రగతిని సదస్సులో
పారిశ్రామికవేత్తలకు విస్తారంగా చాటి చెప్పనున్నామని తెలిపారు. దేశంలోనే
ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర
తీరం ఉందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్నామని ఆయన తెలియజేశారు.
మారీటైం బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను
అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇప్పుడున్న పోర్టులకు అదనంగా నాలుగు కొత్త
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామని అని తెలిసే తెలిపారు. ఈ
ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి వెసెల్ రాబోతుందని అమర్నాథ్
చెప్పారు. ఇదిలా ఉండగా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడును రాబట్టేందుకు
అవకాశాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. దీనికోసం రాష్ట్రంలో 29
ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. అదేవిధంగా 646 చదరపు కిలోమీటర్ల పరిధిలో
పిసిపిఐఆర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో
ఉన్న హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్.టి.పి.సి తదితర కర్మాగారాలను ప్రపంచ స్థాయిలో
ఫోకస్ చేయనున్నామని ఆయన చెప్పారు. కాగా 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం
నుంచి 1,44,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో 2 వేల ఎకరాలలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నమని ఇందులో
సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
70 శాతం వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగిన ఆంధ్రప్రదేశ్ జి ఎస్ డి పి లో ప్రథమ
స్థానంలో నిలిచిందని అని చెప్పారు. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ రంగంలో పెద్ద
ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అని చెప్పారు. ఈరంగంలో పెట్టుబడులు
పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఐటీ అండ్
ఎలక్ట్రానిక్ రంగంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ప్రాంతాలను మేజర్
కాన్సెప్ట్ సిటీలుగా రూపుదిద్దుతున్నమని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు
ఆనుకుని 100 ఎకరాలలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి సెకనుకు ఒక సెల్ ఫోన్ తయారవుతోందని మంత్రి అమర్నాథ్
చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్ హబ్స్ ఏర్పాటు
చేస్తున్నామని చెప్పారు. 2023-28 సంవత్సరానికి గాను కొత్త పారిశ్రామిక
విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అని చెప్పారు.