దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్. నుంచి ఆస్కార్ కు నామినేట్
అయిన పాట ‘నాటు నాటు’ 95వ అకాడమీ అవార్డ్స్‌లో ప్రదర్శించనున్నట్టు షో
నిర్మాతలు ప్రకటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యంతో రూపొందిన
ఈ ఆకర్షణీయమైన పాటలో నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీశారు. ఈ పాటను
గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వారి ఆస్కార్ అరంగేట్రంలో
ప్రదర్శించనున్నారు. క్రాస్-కల్చరల్ హిట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో
‘నాటు..నాటు..’ పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘నాటు నాటు’
పాట వైరల్ సెన్సేషన్‌గా మారింది. యూట్యూబ్‌లో 122 మిలియన్లకు పైగా వీక్షణలను
సంపాదించింది. జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేసిన 95వ ఆస్కార్ వేడుకలు మార్చి 12న
ABCలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇదిలా ఉంటే ఆస్కార్‌కు
ముందు ఈ పాట ప్రపంచ వేదికపై పలు అవార్డులను కైవసం చేసుకుంది. జనవరిలో ‘నాటు
నాటు’ ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్‌ను గెలుచుకుంది. ఐదు
రోజుల తర్వాత, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 28వ ఎడిషన్‌లో ‘RRR’ మరో రెండు
అవార్డులను కైవసం చేసుకుంది.