విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం
వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల
పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర
ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద
గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ రేపు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సదస్సుకు
సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. మరికొద్ది సేపట్లో సదస్సు
ప్రాంగణం అంతా సెక్యురిటీ లైజన్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే Advantage.ap.in
లో 14వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రేపు వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం
కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగింది. సీఎం జగన్
ఈ రోజు సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం రేపు జరగబోయే సదస్సుకు
సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రేపు 10.15 గంటలకు సీఎం జగన్
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ దేశాలకు
చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల
అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది.
పెట్టుబడుల ద్వారా అధిక ఉద్యోగాల కల్పనే లక్ష్యం : సీఎం జగన్ అంటే
క్రెడిబిలిటీ. వారి నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది అనే నమ్మకాన్ని
రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకి కల్పించామన్నారు రేపు కూడా అదే నమ్మకాన్ని
గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్ర ఎకానమీని
అభివ్రుద్ది చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య
ఉద్దేశమని వివరించారు. 46 దేశాల ప్రముఖులు వచ్చేస్తున్నారు. 8 నుంచి 10 మంది
అంబాసిడర్స్ కూడా వస్తున్నారని.. వారికి రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర
ప్రభుత్వం తరపున అందరికీ విందు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డెలిగేట్స్ కు
ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని వెల్లడించారు.
పెట్టుబడిదారులకు అన్ని రకాల సహరించడానికి సిద్ధం : పెట్టుబడులు పెట్టేవారికిి
ల్యాండ్స్, అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి
తెలిపారు. చేసుకున్న ఎంవోయూలను వారు ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం
చేయమని సీఎం సూచించారని వెల్లడించారు. అదేవిధంగా, ఇన్వెస్ట్ మెంట్లను బేస్
చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ లను క్రియేట్ చేశామన్నారు. ఈ సదస్సు వేదికగా
మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్ గా
పెట్టుకున్నారని. భారీగా పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉపాధి కల్పించడమే
లక్ష్యని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త
ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు.