విశాఖపట్నం : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముంబైలో ప్రముఖ
పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. మంగళవారం పిరమల్ పరిశ్రమ ఛైర్మన్ అజయ్
పిరమల్ ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ
వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున
ఆయన ఆహ్వానం పలికారు. అనంతరం గోద్రేజ్ సంస్థ ఛైర్మన్ నదిర్ గోద్రేజ్ ను కలిసి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం
నిర్వహించబోయే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కోరారు. హిందూజా సంస్థల గ్రూప్
చైర్మన్ అశోక్ హిందూజా తో సమావేశమయ్యారు. ఆయనను కూడా విశాఖ సదస్సుకు రావాలని
ఆహ్వానించారు. రాష్ట్రంలో సహజ వనరులు, పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాలపై
మంత్రి బుగ్గన చర్చించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి
కే.సునీత హాజరయ్యారు.