హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు సిహెచ్ రాజేశ్వరరావు సోమవారం రాత్రి
హైదరాబాదులో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజేశ్వరరావు ఆయనకు ప్రెస్ అడ్వైజర్ గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ( ఏపీఎస్ఈబీ)కి కూడా ఆయన సలహాదారుగా
వ్యవహరించారు. దీర్ఘకాలం ఆంధ్ర పత్రికలో రిపోర్టర్ గా పనిచేసిన రాజేశ్వరరావు ఆ
తర్వాత ఢిల్లీలో ఇండియన్ ఎక్స్ ప్రెస్, దక్కన్ క్రానికల్ పత్రికలకు పనిచేశారు.
మన తెలంగాణ పత్రికకు ఒంబుడ్స్ మన్ గానూ, హెచ్ఎంటీవీ సలహాదారుగానూ రాజేశ్వరరావు
పని చేశారు.
రాజేశ్వర్ రావుకు ఐజేయూ,టీయుడబ్ల్యుజె నివాళి
సీనియర్ పాత్రికేయులు, హెచ్ ఏం టీవీ సలహాదారులు సి.హెచ్.రాజేశ్వర్ రావు మృతి
పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్రవర్కింగ్
జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. మంగళవారం
బోయిన్ పల్లిలోని హష్మత్ పేట్ లో రాజేశ్వర్ రావు మృతదేహాన్ని ఐజేయూ జాతీయ
అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కే.విరాహత్ అలీలు సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మీడియా రంగానికి
రాజేశ్వర్ రావు అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను
శ్రీనివాస్ రెడ్డి ఓదార్చారు.
రాజేశ్వరరావు మృతికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఉపాధ్యక్షులు అంబటి
ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే
అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు
జయరాజు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్న లిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి
శివ, సామ్నా ప్రధానకార్యదర్శి రమణారెడ్డి, ఫొటోజర్నలిస్ట్స్ సంఘం అధ్యక్షులు
సాంబశివరావు, విజయవాడ అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి,
కొండారాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మరా జు చలపతి
రావు,వసంత్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎస్ కే బాబు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం
చేశారు.