విజయవాడ : విజయవాడలో ని సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జికి పక్కనున్న శ్రీ దేవి
కరుమారి అమ్మన్ శక్తి పీఠంలోని అమ్మవారిని దర్శించుకోవడం తనకెంతో అదృష్టంగా
భావిస్తున్నానని విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి
అన్నారు.మంగళవారం ఉదయం శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో అమ్మవారి
సన్నిధిలో సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక మహోత్సవ బ్రోచరుని ఆమె చేతులు
మీదుగా లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ
అమ్మవారి దర్శనం తనకెంతో మానసిక ప్రశాంతత భావం కలిగిందన్నారు.అమ్మవారి శక్తి
పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు చేపట్టిన ఈ సహస్ర చండీ యాగం,మహా
కుంభాభిషేకంలో భక్తులు యావన్మంది పాల్గొని జయప్రదం చెయ్యాలని మేయర్
పిలుపునిచ్చారు. తొలుత మేయర్ కి శక్తి పీఠం తరుపున సంప్రదాయం ప్రకారం సన్నాయి
మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు.ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పట్టు
వస్త్రాలు సమర్పించారు.తదుపరి మేయర్ బ్రోచరుని ఆవిష్కరించారు. అలాగే మేయర్
భాగ్యలక్ష్మి కి అమ్మవారి చిత్రపటం బహుకరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు మాట్లాడుతూ ఏప్రిల్ 27 నుండి మే నెల 3 తేదీ వరకు
జరిగే సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేకం శ్రీ కంచికామకోటి పీఠాధీసులు
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహస్వామి వారి ఆధ్వర్యంలో విజయవాడలోని
శ్రీ దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల
శివప్రసాదశర్మ వారిచే యాజ్ఞకములు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే చండీ యాగ
ప్రాంగణంలో 70 అడుగులు ఎత్తులో మహా చండీ ప్రతిమను ప్రతిష్ఠ చేయనున్నామని
ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జ్ఞానేష్,మహిళా భక్తులు పాల్గొన్నారు.