పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటులు అనుష్క శర్మ, తాప్సీ పన్ను, అభిషేక్ బచ్చన్ వంటి బాలీవుడ్ తారలు బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇది సంతోషకరమైన సందర్భం అంటీ వారు పేర్కొన్నారు. ఇకపై మహిళల, పురుషుల క్రికెట్ జట్లకు సమాన వేతనం ఉంటుందని బీసీసీఐ జే షా ప్రకటించడం వివక్ష నిర్మూలనకు ఇది తొలి అడుగు అని అభిప్రాయపడ్డారు. క్రికెట్లో లింగ సమానత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో సెంట్రల్ కాంట్రాక్టు పొందిన మహిళా, పురుష ఆటగాళ్లకు సమాన మ్యాచ్ ఫీజును బీసీసీఐ యొక్క మైలురాయి నిర్ణయాన్ని మంచి నిర్ణయమని బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, అనుష్క శర్మ గురువారం ట్వీట్ చేశారు. .