అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి నిర్బంధాన్ని
ప్రయోగించారు. పలు జిల్లాల్లో అంగన్వాడీలను, సిఐటియు నాయకులను అడ్డుకొని
అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. కొందరిని గృహ నిర్బంధంలో
ఉంచారు. కొందరికి 149 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. విజయనగరంలో జిల్లాలో
91 మంది అంగన్వాడీలను, పలువురు సిఐటియు నాయకులను అరెస్టు చేసి బబ్బిలి,
బాడంగి, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కర్నూలు జిల్లా
ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పలువురు సిఐటియు, అంగన్వాడీ నాయకులను
పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చిప్పగిరి మండలంలో అంగన్వాడీ వర్కర్లను
గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో సిఐటియు పట్టణ అధ్యక్షులు
లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో బస్సులో
విజయవాడ బయలుదేరిన అంగన్వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి
స్టేషన్‌కు తరలించారు.
వారికి భోజనం కూడా పెట్టలేదు. అనంతపురం జిల్లా
గుంతకల్లులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రేష్మాను
రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో అంగన్వాడీ
ప్రాజెక్టు అధ్యక్షులు యం.శోభారాణి, కార్యకర్త నీరజ, ఆయాలు జి.భాగ్యలక్ష్మి,
జి.కోటేశ్వరిని చంటి పిల్లలతో సహా స్టేషన్‌కు పిలిపించి పోలీసులు నోటీసులు
ఇచ్చారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును పోలీసులు
గృహనిర్బంధం చేశారు. చలో విజయవాడకు వెళ్తే చర్యలు తీసుకుంటామంటూ ఆ జిల్లాలోని
అంగన్వాడీలకు సెక్షన్ 149 సిఆర్పిసి కింద నోటీసులు అందించారు. అనకాపల్లి,
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి,
పల్నాడు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు అంగన్వాడీలు, సిఐటియు,
ఐద్వా నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు. ఈ జిల్లాల్లో పలువురిని
గృహ నిర్బంధంలో ఉంచారు.
అంగన్వాడీల చలో విజయవాడ ఉద్రిక్తం
విజయవాడ : ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
వెల్లువెత్తుతున్నాయి. సోమవారం చలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునిచ్చిన
నేపథ్యంలో …. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అంగన్వాడీలు, వామపక్షాల
అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారు.
ఈ ఆందోళనలకు సిపిఎం నాయకులు 51 డివిజన్ కార్పొరేటర్ వై.సత్తిబాబు చౌదరి
సుబ్బారెడ్డి సంఘీభావం ప్రకటించారు. వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని
నినదించారు.
అరెస్టు అప్రజాస్వామికం
అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామికమని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు అన్నారు. రైల్వే స్టేషన్ వద్ద, ఇతర చోట్ల ఎక్కడికక్కడ 1500
మంది అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) ఖండిస్తున్నదన్నారు. కార్మిక
సంఘ నాయకులు సి.హెచ్.బాబూరావు, సి.హెచ్. నరసింగరావు సహా కార్యకర్తల
అరెస్ట్‌లను ఖండించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.