అమరావతి: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ని నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎం. వీ రామచంద్రారెడ్డి, ఎ. మధుసూదన్
కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి,
పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కలిశారు. అలాగే
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డిని నూతనంగా
ఎంపికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి
చంద్రశేఖర్‌రెడ్డి కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీలు టి కల్పలత, ఎం
వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సీఎంకు విజ్ఞాపన పత్రం
అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను
పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలన్న నిబంధనను
తొలగించాలని సీఎంకు ఎమ్మెల్సీలు విన్నవించారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తిపై
స్పందిస్తూ ఈ నిబంధనను మార్పు చేస్తూ సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల
చైల్డ్ కేర్ లీవ్‌ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ
ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల
రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ను మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు
పెంచాలని సీఎంకు విజ్ఞప్తి చేయగా దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ మేరకు
ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.