విజయవాడ : సింగనమల నియోజకవర్గం లో నష్టపోయిన ప్రతి ఉద్యానవన ,వ్యవసాయ రైతులకు
ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పిసిసి మాజీ అధ్యక్షులు సాకే
శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పుట్లూరు మండలంలోని కడవకల్లు,
దోశలేడు, ఓబులాపురం, పుట్లూరు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను
పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన పంటలను చూస్తుంటే బాధ
వేస్తుందన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే సమయంలో పంట
నేలపాలు కావడం దారుణమన్నారు. పడిపోయిన గెలలను చూస్తుంటే గుండె
తరుక్కుపోతుందన్నారు. అధికారులు రాజకీయాలకు అతీతంగా పంటలను నష్టం అంచనా వేసి
జాబితా ప్రభుత్వానికి పంపాలన్నారు.