విజయవాడ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి
వేధిస్తుండటం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్
శ్రేణులు పెద్దయెత్తున విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర
కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు ఆంధ్ర రత్న భవన్ నుండి
కాంగ్రెస్ ర్యాలీ ధర్నా చౌక్ చేరింది. ఏఐసిసి కార్యదర్శి, తమిళనాడు రాష్ట్ర
బాధ్యులు సిరివెళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ బిజెపి, మోడీ, ఆర్ ఎస్ ఎస్ మూడు కలిసి
అదానీ అంబానీలు దోచిపెడుతున్నాయని, చట్టసభలలో రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు
సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని
విమర్శించారు. కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ గాంధీ
కుటుంబం త్యాగాల కుటుంబమనీ, ఇటువంటివి ఎన్నో ఎదుర్కొన్నారని, దేనికి భయపడేది
లేదని అన్నారు. సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ కన్యా కుమారి నుండి జమ్ము కాశ్మీర్
వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీకి ప్రాణభయం వున్నదని తెలిసినా పాదయాత్ర
దిగ్విజయంగా ముగించారని అన్నారు. నగర అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు నరహరసెట్టి
నరసింహరావు మాట్లాడుతూ ఇందిరా గాంధీ హయాం నుండి ఇలాంటి అరాచకాలను పార్టీ ఎన్నో
ఎదుర్కొందని అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ
ధర్నాలో లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, పి.వై.కిరణ్, తాంతియా కుమారి,
కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వర రావు, దాస్, పీటర్ జోసెఫ్, అన్సారీ,
ఖుర్షీద, ప్రమీల గాంధీ, సతీష్ ధర్నా లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.