విజయవాడ : కొంతమంది అధికారుల తీరుపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కింద
స్థాయిలో గ్రామ రెవిన్యూ అధికారులను, పనులు చేయమంటారు కానీ వారికి కావాల్సిన
మౌలిక వసతులు కల్పించకుండా అటు రీసర్వే , ఇటు రోజు వారి విధులు తో విఆర్వోలను,
అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో
ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామాల నుండి సుమారు 100 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు
రీ సర్వే పేరుతో డిప్యూటేషన్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం
వారు పనిచేస్తున్న గ్రామాల్లో కూడా ఎఫ్ పి ఓ ఎల్ ఆర్. రిసర్వే వర్క్
జరుగుతుంటే మరలా వేరే గ్రామాలకు విఆర్వోలు లేరని మరల వేరే ప్రాంతాలకు
విఆర్ఓలను, డిప్యూటేషన్ లు ,వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ
సీసీఎల్ఏ అధికారులకు వెంటనే డిప్యూషన్స్ క్యాన్సిల్ చేయాలని, విఆర్వోలుకు
కావలసిన స్టేషనరీ, కంప్యూటర్ సిస్టం ఇతర సదుపాయాలు కల్పిస్తేనే సక్రమంగా
విధులు నిర్వహించగలమని తెలియజేయడం జరిగిందన్నారు.
రీసర్వే పేరుతో వీఆర్వోలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఒక్క
రూపాయి కూడా ఇవ్వకుండా ముందు పెట్టుబడులు పెట్టి పనులు చేయాలని కింద స్థాయిలో
అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వీఆర్వోలు అందరూ తీవ్ర
అసంతృప్తిగా ఉన్నారని, ఇప్పటివరకు రీసర్వేకు ఖర్చు పెడుతున్న ఖర్చులు ఒక
రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో 3795 మంది, 2020 సంవత్సరం
నుండి వీఆర్ఏలనుండి వీఆర్వోలుగా పనిచేస్తున్న, గ్రామ రెవెన్యూ అధికారులకు
ప్రొబిషన్ విషయంలో, తీవ్ర అన్యాయం జరిగిందని, అధికారులు నిర్వహించవలసిన టైంలో
సర్వే ట్రైనింగు, ఎగ్జామ్స్ నిర్వహించనందున, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల
పైగా 15 వేల రూపాయలతో విధులు నిర్వహిస్తూ ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు
పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో సర్వే ట్రైనింగ్ ఎగ్జామ్స్, నిర్వహించి రిజల్ట్స్ కూడా ఇచ్చి
సుమారు మూడు నెలలైనా గ్రేడ్- 2 విఆర్వోలకు, పాసైనవారికి, వారి యొక్క ప్రొబి
షన్ విషయంలో కూడా జిల్లా అధికారులు కొంతమంది ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు
వస్తే కానీ ప్రొబిషన్ చేయమని, చాలా జిల్లాల్లో గ్రేడ్ -2 వీఆర్వోలను
ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 13 జీవో ప్రకారం, సర్వే ఎగ్జామ్,
సి పి టి, పాస్ అయిన వారికి రూల్స్ ప్రకారం చేయవలసి ఉన్న ఎందుకు నిర్లక్ష్యం
చేస్తున్నారని, అలాగే ఫెయిల్ అయిన గ్రేడ్ -2 వీఆర్వోల విషయంలో కూడా ఏదో
నిర్ణయం తీసుకుని వారికి కూడా న్యాయం చేయాలని కోరిన ఇప్పటివరకు ఎటువంటి
నిర్ణయం తీసుకోపోవడం పట్ల రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.