రోల్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో
ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని
గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ,
మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.నాని హీరోగా రూపొంది విడుదలవుతున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ
సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పటికే నార్త్ సహా సౌత్ లోని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి సినిమాను ప్రమోట్
చేసుకుని వచ్చారు. నాని ప్రస్తుతానికి తెలుగు మీడియాలో కూడా ప్రమోషన్స్
చేస్తున్నారు.
కచ్చితంగా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని సినిమా ధియేటర్లకు
ప్రేక్షకులు క్యూ కడతారని నాని అంచనాలు వేసుకుంటున్నాడు. దసరా సినిమా నాని
హీరోగా నటించిన ఈ సినిమా నైజాం ప్రాంతం నేపథ్యంలోనే తెరకెక్కడంతో ఈ సినిమా
నైజాం ప్రాంతంలో అత్యధిక రేటుకు అమ్ముడు పోయింది. 14 కోట్ల రూపాయలకి ఈ సినిమా
హక్కులు నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు.
ఇక ఉత్తరాంధ్ర మూడు కోట్ల 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రెండు కోట్ల 30 లక్షలు,
వెస్ట్ గోదావరి రెండు కోట్లు, గుంటూరు మూడు కోట్లు, కృష్ణా రెండు కోట్లు
నెల్లూరు కోటి 30 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో 35 కోట్ల
రూపాయల మేర ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. ఇక మిగతా భారతదేశం అంతా కలిపి మూడు
కోట్లకు అమ్ముడుపోతే ఓవర్సీస్ లో ఆరు కోట్లకు ఈ సినిమా హక్కుల అమ్ముడయ్యాయి.
మొత్తం మీద ఈ సినిమా 44 కోట్ల థియేటర్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా 45
కోట్లు వసూలు చేస్తే హిట్టుగా పరిగణించబడుతుంది.