రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా
కడప : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో వైద్యరంగానికి పెద్ద
పీఠ వేస్తున్నారని, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం
జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి.
అంజాద్ బాషా అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద 104 వాహనాలను రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా చేతుల మీదుగా
లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్. బి. అంజాద్ బాషా మాట్లాడుతూ
రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైద్యానికి ఎక్కువ
ప్రాధాన్యతనిస్తూ జరుగుతోందని, గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్
రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ ముందుకు
వెళ్లున్నారన్నారు.
గతంలో 1004 వ్యాధులకు మాత్రమే చికిత్స ఉండేదని ప్రస్తుతం 3400
పైచిలువ్యాధులను జోడించడం పేద ప్రజలకు వైద్యం అందించడం జరుగుతోందన్నారు.
తద్వారా వెయ్యి రూపాయలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం
ద్వారా మెరుగైన వైద్యం అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం వైద్యం
అందించడమే కాక వైయస్సార్ ఆసరా పథకం ద్వారా కూడా డాక్టర్ సూచించిన మేరకు
రెస్ట్ పీరియడ్ కు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం
జరుగుతుందని అన్నారు.
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎంబిబిఎస్ డాక్టర్ ఉండే పరిస్థితి ఉండేది
కాదని, కానీ ప్రస్తుతం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబిబిఎస్
డాక్టర్లను నియమించడం జరిగిందని, ఆ ఇద్దరు డాక్టర్లలో ఒక డాక్టర్ 104 వాహనం
ద్వారా మండలంలోని క్షేత్రస్థాయిలో గ్రామాలకు టైం టేబుల్ ప్రకారం వెళ్లడం
జరుగుతోందని, గ్రామాలలో వెళ్లి ఇంటి వద్దనే వైద్యం అందించడం జరుగుతోందని
అన్నారు. మరో డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం జరుగుతోందని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం
జరుగుతోందని చెప్పారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం దేశానికే
ఆదర్శమని చెప్పారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా గ్రామ ప్రజలకు మెరుగైన
వైద్యం అందించడం జరుగుతోందని 104 వాహనం ద్వారా 64 రకాల మందులు అందుబాటులో
ఉంటాయని, అదేవిధంగా ఈసీజీ కనీస అవసరానికి సంబంధించిన చికిత్సలు ఈ వాహనంలో
అందుబాటులో ఉంటాయని అన్నారు.