ఇంటి ముందు ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలికను మాయమాటలతో తీసుకెళ్లి ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను సామాజిక మాద్యమాల్లో పోస్టింగ్ చేశారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు మైనర్ బాలురను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 14-17 సంవత్సరాల వయస్సు గల మైనర్లు, బాధితురాలు జెనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు బాలిక తండ్రి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. దీంతో బాల నేరస్తులను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.