విజయవాడ : స్థానిక 48వ డివిజన్ చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపం లో
బుధవారం 48,49,మరియు 51వ డివిజన్ల లోని స్వయం సహాయక సంఘాల లోని అక్కా
చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పధకం క్రింద మూడవ విడత రుసుము విడుదల కార్యక్రమం
జరుగింది ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి
శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని 543 స్వయం సహాయక సంఘాల లోని 5430 మంది
అక్కా చెల్లెమ్మలకు 3 కోట్ల 82 లక్షల 57వేల 61 రూపాయల విలువైన చెక్కు ను
అందచేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్ర పటానికి మహిళలతో కలిసి పాల అభిషేకం చేశారు
అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ ఆసరా కార్యక్రమం అంగరంగా వైనవంగా
నిర్వహిస్తున్నాం. గతంలో మాటలు చెప్పే ముఖ్యమంత్రిని చూశాం ఇప్పుడు చేతలు చేసి
చూపే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఇచ్చిన మాట ప్రకారం మాట
నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.గతంలో చంద్రబాబు మాటలు
హమిలకే పరిమితం చేశాడన్నారు.మహిళ లోకం అంతా జగన్ మోహన్ రెడ్డి కి జైజై లు
కొడుతున్నారన్నారు. మహిళ సొంత ఇంటి కలను నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల
కార్పొరేటర్లు అత్తులురి ఆదిలక్ష్మి, బూల్లా విజయ్ కుమార్, మరుపిళ్ళ రాజేష్,
క్లస్టర్ ఇంచార్జ్లు, సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు, తదితర పార్టీ నాయకులు
కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు మరియు స్వయం సహాయక సంఘాల అక్కా
చెల్లెమ్మలు పాల్గొన్నారు.