కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గొప్ప ‘శివభక్తుడు’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం అన్నారు. రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది కావడం విశేషం. “విశ్వాస్ స్వరూపం” విగ్రహాన్ని బోధకుడు మొరారీ బాపు, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సి పి జోషితో కలిసి సీఎం శనివారం ఆవిష్కరించారు. “10 సంవత్సరాల తర్వాత, అద్భుతమైన విగ్రహం సిద్ధమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు చాలా సంతోషంగా ఉంటారని నేను అర్థం చేసుకున్నాను” అని గెహ్లాట్ విలేకరులతో అన్నారు. “మా రాహుల్ గాంధీ జీ కూడా శివభక్తుడని మీకు తెలుసా. శివుడిని ఆరాధించే వ్యక్తి ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు. విగ్రహం సిద్ధమైనందుకు సంతోషంగా ఉంది” అని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు.