జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రాట్లే పవర్ ప్రాజెక్ట్ సమీపంలో శనివారం కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు పౌరులు మరణించారు. అలాగే మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనిపెట్టి రక్షించే ఆపరేషన్ ముగిసిందని వారు తెలిపారు. రాట్లే పవర్ ప్రాజెక్ట్ సైట్ సమీపంలో లింక్ రోడ్డు నిర్మాణంలో కూలీలు పని చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. జేసీబీ యంత్రంతో తవ్వుతుండగా పెద్ద బండరాయి కిందపడి కార్మికులు చిక్కుకుపోయారు.