ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వాతావరణ మార్పు సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే నెలలో ఈజిప్టుకు వెళ్లనున్నారు. బైడెన్ పర్యటనకు సంబంధించిన వివరాలను వైట్ హౌస్ శుక్రవారం వెల్లడించింది. అమెరికా, ఏసియన్ వార్షిక సదస్సు, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బైడెన్ అధ్యక్షుడు నవంబర్ 12-13 వరకు కంబోడియాకు వెళతారు. ఆ తర్వాత జీ-20 నాయకుల సదస్సు కోసం నవంబర్ 13-16 మధ్య ఇండోనేషియాలోని బాలిని సందర్శిస్తారు. నవంబర్ 11న షర్మ్ ఎల్-షేక్లో జరిగే సమ్మిట్లో, ప్రపంచ వాతావరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు వాతావరణ ప్రభావాలకు అత్యంత హాని కలిగించే ఘటనల నివారణపై బైడెన్ ప్రసంగిస్తారు.