కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. రాహుల్ తన
భారత్ జోడో యాత్రలో ఆర్‌ఎ్‌సఎ్‌స పై చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ కార్యకర్త
కమల్ భదౌరియా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో ఈ దావా వేశారు. జనవరి 9న
హరియాణాలోని అంబాలాలో రాహుల్ మాట్లాడుతూ.. ఆర్‌ఎ్‌సఎస్ సభ్యులను ‘21వ
శతాబ్దపు కౌరవులు’గా విమర్శించారని భదౌరియా తన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై కోర్టు ఈ నెల 12న విచారణ జరపనుంది. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా
భీవండి మేజిస్ట్రేట్ కోర్టులో తనపై దాఖలైన మరో పరువు నష్టం కేసులో విచారణకు
హాజరు కాకుండా శాశ్వత మినహాయింపు ఇవ్వాలని రాహుల్ పిటిషన్ వేశారు. దీనిపై ఈ
నెల 15న విచారణ జరగనుంది.