ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్
హైదరాబాద్ : తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు
ఫ్యాక్టరీని తెలుగు ప్రజలే కాపాడుకోవాల్సిన రోజు వచ్చిందని భారత రాష్ట్ర సమితి
అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పిలుపుచిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలపై తెలంగాణా
మంత్రి కె.టి. రామారావు విడుదల చేసిన ప్రకటనని డాక్టర్ తోట చంద్రశేఖర్
స్వాగతించారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడంపై భారత రాష్ట్ర సమితి
మాత్రమే స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోందని, కేటీఆర్ ప్రకటన ఏపీ ప్రజల్లో
నూతనోత్సాహాన్ని నింపిందని ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ వెల్లడించారు. ఇప్పటికే
ఉత్తరాంధ్రకు చెందిన వివిధ వర్గాల నేతలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు
జరిపామని అతి త్వరలోనే ఈ అంశంపై స్పష్టమైన ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తామని
డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.