అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అధికారం తమదేనని రేవంత్
ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అదానీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులపై కూడా
స్పందించారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో కూడా అధికారంలోకి
వచ్చినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో సీఎం కేసీఆర్
చర్చకు రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడ రైతులు
ఉరికొయ్యలకు వేలాడుతున్నలెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని
ఎద్దేవా చేశారు.
మరోవైపు గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అదానీలకు ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకే అనర్హతవేటు
వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాన్ని నిజం అనిపించేలా చెప్పడంలో కేసీఆర్‌కు
మించినవాడు లేడని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో
రేవంత్‌రెడ్డితో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర
ముఖ్య నాయకులు హాజరయ్యారు.
పోస్టు కార్డుల ఉద్యమం : రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని, అనర్హత వేటు
వేసిందని చెప్పారు. ఈ విషయంపై సమాధానం చెప్పలేకనే హుటాహుటిన రాహుల్‌పై ఇలాంటి
చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. అందుకు నిరసనగా సోమవారం పోస్టు కార్డు
ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8న మంచిర్యాలలో భట్టి విక్రమార్క
ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభ : ఈనెల 10 నుంచి 25వరకు జుక్కల్ నుంచి తిరిగి
హాథ్ సే హాథ్ పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 25లోపు
గజ్వేల్‌లో లక్ష మంది నిరుద్యోగులతో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని
తెలిపారు. పేపర్ లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, ఇప్పుడున్న
టీఎస్పీఎస్సీ కమిషన్‌ను రద్దు చేసి తక్షణమే కొత్త నియామకాలను చేపట్టి మిగిలిన
పరీక్షలు నిర్వహించాలని హెచ్చరించారు. ఈనెల 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంజాన్
నేపథ్యంలో కుతుబ్‌షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు.