వెలగపూడి : రాజధాని అమరావతి పరిధిలో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్థలాల
కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 45పై రాజధాని రైతు ఐకాస
నేతలు హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలు చేసిన
లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రైతుల తరఫున
సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఇదే విషయంపై
ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన
పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని
కోర్టుకు తెలిపారు. గతంలోనే ఆర్-5 జోన్‌పై జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిందని
కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రధాన పిటిషన్ ఎవరి
వద్ద ఉందని ప్రశ్నించింది. త్రిసభ్య ధర్మాసనం వద్ద ఉందని పిటిషనర్
సమాధానమిచ్చారు. దీంతో తాజా పిటిషన్‌ను పెండింగ్ పిటిషన్‌తో జత చేసే విధంగా
చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలో
1,130 ఎకరాల భూమిని ఇళ్లస్థలాలకు ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమిని అప్పగించాలని
జీవోలో పేర్కొన్నారు. దీనిపై మార్చి 31న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో విడుదల చేశారు. ఆ భూమి విలువ రూ.1,162 కోట్లుగా
జీవోలో ప్రభుత్వం పేర్కొంది. తమ భూముల్లో ఇతరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని
చెప్పడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.