మచిలీపట్నం :స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి
చేయని విధంగా గౌరవ జగన్ మోహన్ రెడ్డి లక్షలాది కోట్ల రూపాయలను వివిధ పథకాల
ద్వారా లబ్దిదారుల ఖాతాలకు నేరుగా జమ చేసారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
జోగి రమేష్ తేల్చి చెప్పారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్ఆర్ ఆసరా
వారోత్సవాలు పండుగ వాతావరణంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. మహిళలు
ఊరూరా సభలు పెట్టి సీఎం వైయస్ జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు
తెలియజేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బంటుమిల్లి మండలం ఆర్తమూరు జిల్లా
పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో వైయస్సార్ ఆసరా మూడో విడత వారోత్సవాల్లో భాగంగా
మంత్రి జోగి రమేష్ మెగా చెక్కును మహిళలకు పంపిణీ చేశారు. బంటుమిల్లి మండలంలోని
ఆర్తమూరు, మణిమేశ్వరం, ముంజులూరు, కంచడం, బర్రిపాడు, సాతులూరు, ఇంతేరు,
చినపాండ్రెక గ్రామాల్లో 355 స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.3.38
కోట్లు, చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్
మాట్లాడుతూ,గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళల పేరుతో ఉన్న
బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరిస్తూ, ఆ మొత్తాన్ని వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా
నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందేనని
తెలిపారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపు – కుంకుమ కింద నగదు అందజేసి చేతులు
దులుపుకున్నారని, అయితే విజ్ఞులైన అత్యధిక శాతం మహిళలు ఆ నాయకుని వక్రబుద్ధి
గ్రహించి ఎన్నికల్లో ఆ పార్టీని దూరంగా పెట్టారని వివరించారు. 2019 ఎన్నికల్లో
వైఎస్ఆర్సిపికి అధికారం అప్పగించి ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బంటుమిల్లి జెడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, ఎంపీపీలు వెలివెల
చినబాబు, మండల ఉపాధ్యక్షులు ఒడిమి చిన్నారిబాబు, యువ నాయకుడు జోగి రాజీవ్,
బంటుమిల్లి ఏఎంసి చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు, వైస్ చైర్మన్ పాలడుగు
బాబూరావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని
శ్రీనివాసరావు, బంటుమిల్లి మండల పార్టీ కన్వీనర్ ఎం.రాజబాబు, మండల సచివాలయ
కన్వీనర్ కొప్పర్తి సుబ్బారావు, బీసీ సెల్ మండల అధ్యక్షులు బొమ్మిడి
నాగార్జున, ఎంపీడీవోలు స్వర్ణ భారతి, తాహిసిల్దార్లు సత్యనారాయణ, సర్పంచులు,
వైయస్సార్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు మహిళలు
పాల్గొన్నారు.