స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాయే టైటిల్
ఫెవరెట్. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ నుంచి నిష్కమించిన భారత జట్టు,
2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్ నుంచి ఇంటిదారి పట్టింది. అయినా ఈసారి
టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి..
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్
గాయాలతో టీమ్‌కి దూరమయ్యారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్,
వన్డే వరల్డ్ కప్ సమయానికి కోలుకోవడం అసాధ్యమే. బుమ్రా, అయ్యర్ ఆడతారా? లేదా?
అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి…శ్రేయాస్ అయ్యర్ వరుసగా గాయపడుతుండడంతో
వన్డేల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు
సూర్యకుమార్ యాదవ్. ఒకే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన
ప్లేయర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు…అంచనా ప్రకారం సూర్యకుమార్ యాదవ్‌ని
వన్డేల్లో కొనసాగిస్తే, అతను ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించి ఇస్తాడు. ప్రతీ
ప్లేయర్ కెరీర్లో ఏదో ఒకసారి తడబడడం, ఫామ్ కోల్పోవడం చాలా సాధారణ విషయం.
సూర్యకుమార్ యాదవ్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు..
సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వస్తే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. నా ఉద్దేశంలో
ఆస్ట్రేలియాకి ఆండ్రూ సైమండ్స్లా, ఇండియాకి సూర్యకుమార్ యాదవ్ ఉపయోగపడతాడు.
కొందరు ప్లేయర్లకు చూసుకుని జాగ్రత్తగా ఆడడం రాదు, అది వారి బలహీనత కాదు, అదే
వారి బలం.. నా ఉద్దేశంలో సూర్య ఎప్పటికీ మ్యాచ్ విన్నరే..’ అంటూ కామెంట్
చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..