టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్
రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు
వెనకేసుకున్నాడు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ధ్వజమెత్తారు. ఒక్క
కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానమని దుయ్యబట్టారు. కర్నాటకలో
కాంగ్రెస్ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు
చేశారు.
కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ
సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్ ద్వారా తన
అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్లు
సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు
సంపాదిస్తున్నారని ఆరోపించారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారన్నారు.
తెలంగాణ చరిత్రను గమనిస్తే.. భూమి కేంద్రంగానే పోరాటాలు జరిగాయన్నారు. భూమి
కన్నతల్లి… భూమి ఆత్మగౌరవం..సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు
భూమి కోసమే జరిగాయి. కేసీఆర్ రాష్ట్రంలో భూ దోపిడీకి పాల్పడ్డారు. భూ దోపిడీతో
కేసీఆర్ లక్ష కోట్లు వెంకేసుకున్నాడు. భూ మాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ
రాజకీయాలను శాసించాలనుకుంటున్నారని విమర్శించారు.
వాస్తవానికి 15 ఎకరాలకు 1500 కోట్లు ఉంటే.. 505 కోట్లు మాత్రమే విలువ
కట్టారు. 10శాతం రెంట్ వసూలు చేయాలంటే ఏడాదికి 50కోట్లు వసూలు చేయాలి. కానీ 50
కోట్ల రెంట్ వసూలు చేయకుండా 15 ఎకరాల కు మొత్తం 1లక్షా 50వేల ప్రకారం కేసీఆర్
పార్థసారధి రెడ్డికి కట్టబెట్టారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని
కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని
ప్రశ్నించారు.