న్యూఢిల్లీ : టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఆమ్
ఆద్మీ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం
సోమవారం ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ,
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్
ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీకి జాతీయ పార్టీ హోదా
రద్దు చేసింది. సోమవారం ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల పంజాబ్
శాసనసభ ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించిన ఆమ్ఆద్మీ పార్టీకి కొత్తగా జాతీయ
పార్టీ హోదా ఇస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో
ప్రస్తుతం భాజపా, బీఎస్పీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీ
ఆఫ్ మేఘాలయ జాతీయ పార్టీ హోదా కలిగిన పార్టీలుగా ఉన్నాయి. జాతీయ హోదా
కోల్పోయిన ఎన్సీపీ, టీఎమ్సీ పార్టీలను.. నాగాలాండ్, మేఘాలయాల్లో రాష్ట్ర
పార్టీలుగా గుర్తించింది.ఏపీలో బీఆర్ఎస్కు చుక్కెదురు

ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపును భారత్ రాష్ట్ర సమితి(తెరాస) కోల్పోయింది.
తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంది. విభజన సమయంలో
తెలుగు రాష్ట్రాల్లో తెరాసకు రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. రాష్ట్ర
విభజన తర్వాత తెరాస ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల సంఘం
బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది.